క్యాన్సర్: కారణాలు, లక్షణాలు మరియు ప్రమాద కారకాలు, చికిత్స విధానాలు

క్యాన్సర్ అంటే ఏమిటి ?

Image

సాధారణంగా మన శరీరంలో కణ విభజనలు ఒక క్రమ పద్ధతిలో జరుగుతాయి. అయితే, కొన్ని కారణాల వల్ల, ఆ కణాలు నియంత్రణ కోల్పోయి, చాలా వేగంగా, అనియంత్రితంగా విభజన చెంది కణ సమూహాలుగా ఏర్పడే స్థితినే క్యాన్సర్ అంటారు. ఈ కణ సమూహాలను 'కణితి' (ట్యూమర్) అని పిలుస్తారు. ఛాతీ, లంగ్స్, చర్మ, గొంతు, గర్భాశయం, అండాశయం, జీర్ణాశయం, పేగులు, నోటి క్యాన్సర్ వంటి దాదాపు 100కు పైగా క్యాన్సర్‌ వ్యాధి రకాలు ఉన్నాయి. క్యాన్సర్‌ వ్యాధి అన్ని వయస్సుల వారికి వచ్చే అవకాశం ఉంటుంది కానీ, వయస్సు పెరుగుతున్న కొద్ది ఈ వ్యాధి ముప్పు ఎక్కువ..

క్యాన్సర్ కణాలు ముందుగా స్థానిక కణజాలం పైన దాడి చేసి వాటిని నాశనం చేయడమే కాకుండా మన శరీరంలోని రక్తం మరియు శోషరస వ్యవస్థ (lymphatic system) ద్వారా ఇతర బాగాలకు కూడా వ్యాపించడాన్ని మెటాస్టాటిక్ క్యాన్సర్ అంటారు. ఈ క్యాన్సర్ మానవ శరీరంలో దాదాపు ఎక్కడైనా రావొచ్చు. ఈ క్యాన్సర్ వ్యాధి పట్ల సరైన అవగాహన లేక పోవడం, నిరక్షరాస్యత, భయం, వివిధ రకాల అపోహల వల్ల చాలా కేసుల్లో వ్యాధి తీవ్ర‌త పెరిగిన త‌ర్వాత గుర్తిస్తుండ‌టంతో ప‌రిస్థితి చేయి దాటిపోయి ప్రాణాలు సైతం కోల్పోతున్నారు.

క్యాన్సర్స్ రావడానికి ముఖ్య కారణాలు:

Image

మన శరీర కణాలు పని చేసే విధానం, విభజన ప్రక్రియలని నియంత్రించే నిర్దిష్ట DNA లోని జన్యు పరమైన మార్పులు కాన్సర్ కి కారణమవుతాయి.

  • పొగాకు వాడకం మరియు మద్యం వినియోగం
  • అధిక బరువు మరియు ఊబకాయం
  • నిశ్చల జీవనశైలి, శారీరక శ్రమ లేకపోవడం
  • కొన్ని రకాల నొప్పి నివారణ మందులు తీసుకోవడం
  • రేడియేషన్‌తో సహా పర్యావరణ మరియు వృత్తిపరమైన ప్రమాదాలు వల్ల కూడా క్యాన్సర్ రావొచ్చు
  • డీఎన్ఏ వల్ల మన తల్లిదండ్రుల్లో ఏవరికైనా క్యాన్సర్ లక్షణాలే ఉంటే మనకు కూడా క్యాన్సర్ వ్యాప్తి వచ్చే అవకాశాలున్నాయి.
  • హెలికోబాక్టర్ పైలోరీ, హెపటైటిస్ బి వైరస్ (HBV), హెపటైటిస్ సి వైరస్ (HCV) మరియు కొన్ని రకాల హ్యూమన్ పాపిల్లోమావైరస్ (HPV) నుండి దీర్ఘకాలిక అంటువ్యాధులు కూడా క్యాన్సర్ కు కారణమవుతాయి.

క్యాన్సర్ యొక్క లక్షణాలు:

Image

క్యాన్సర్ వల్ల వచ్చే సంకేతాలు మరియు లక్షణాలు శరీరంలోని ఏ భాగాన్ని ప్రభావితం చేశాయనే దానిపై ఆధారపడి ఉంటుంది. కొన్ని సాధారణ సంకేతాలు మరియు లక్షణాలు క్యాన్సర్‌తో సంబంధం కలిగి ఉంటాయి,

  • నీరసం మరియు అలసట
  • గుండెల్లో మంట లేదా అజీర్ణం
  • ఆకలి లేకపోవడం, దగ్గు మానకుండా రావడం
  • ఊపిరి ఆడకపోవడం, మింగడంలో ఇబ్బంది పడడం
  • అనుకోకుండా బరువు తగ్గడం, రక్త వాంతులవ్వడం
  • రాత్రుళ్లు ఎక్కువ చెమట పట్టడం
  • గొంతు బొంగురు పోవడం లేదాశరీరంలో గడ్డలు, కణితులు రావడం
  • గుండెల్లో మంట లేదా ఆహారం జీర్ణంకాక అరగకపోవడం
  • కొత్తగా పుట్టుమచ్చలు ఏర్పడడం
  • గొంతు, ముక్కు నుంచి నీరు కారడం
  • నోటి లోపల చిన్న తెలుపు లేదా ఎరుపు బొబ్బలు రావడం
  • రొమ్ములు, చనుమొలలు, చర్మంలో మార్పులు రావడం
  • కలయిక సమయంలో రక్తం కారడం
  • మూత్రంలో రక్తం, మూత్ర విసర్జనలో ఇబ్బంది పడడం

క్యాన్సర్ యొక్క ప్రమాద కారకాలు:

Image
  • వయస్సు: మన వయస్సు పెరిగే కొద్దీ పాడైపోయిన DNAని సరిచేసే శరీర సామర్థ్యం తగ్గిపోతుంది. అందువల్ల, క్యాన్సర్ ప్రమాదం వయస్సుతో పెరుగుతుంది.
  • ధూమపానం: సిగరెట్లు మరియు సిగార్లు తాగడం మరియు ఇ-సిగరెట్లను ఉపయోగించడం పెరుగితే ఊపిరితిత్తులు, ప్యాంక్రియాటిక్, అన్నవాహిక మరియు ఓరల్ క్యాన్సర్‌ను అభివృద్ధి చేస్తాయి.
  • రేడియేషన్ ఎక్స్పోజర్: సూర్యుడి నుండి వచ్చే అతినీలలోహిత (UV) రేడియేషన్ వల్ల కూడా క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ.
  • మద్యపానం: కాలేయం, కడుపుతో పాటు ఆరు రకాల క్యాన్సర్లకు ఈ మద్యపాన వినియోగమే ప్రధాన కారణంగా చెప్పవచ్చు.
  • ఆహారం: అధిక కొవ్వు లేదా అధికంగా పిండి పదార్ధాలు కలిగిన ఆహారాలు తినడం వల్ల కూడా క్యాన్సర్ రావచ్చు.
  • హార్మోన్ థెరపీ: హార్మోన్ రీప్లేస్‌మెంట్ థెరపీ తీసుకునే మహిళలకి రొమ్ము క్యాన్సర్ మరియు ఎండోమెట్రియల్ క్యాన్సర్ వంటివి రావొచ్చు.
  • అంటువ్యాధులు: HPV, HCV, HBV, HIV, EBV కొన్ని రకాల అంటువ్యాధులు కూడా క్యాన్సర్ రావడానికి ప్రేరేపిస్తాయి.

క్యాన్సర్ యొక్క రకాలు:

Image

క్యాన్సర్‌ను ప్రధానంగా అవి ప్రారంభమయ్యే కణ రకాన్ని బట్టి వర్గీకరించవచ్చు

  • కార్సినోమా (Carcinoma): ఈ క్యాన్సర్ చర్మంలో లేదా శరీరం లోపలి అవయవాలని కప్పి ఉంచే కణజాలంలో ప్రారంభమవుతుంది. బేసల్ సెల్ కార్సినోమా, స్క్వామస్ సెల్ కార్సినోమా మరియు ట్రాన్సిషనల్ సెల్ కార్సినోమా అనే వివిధ ఉప రకాలు ఉంటాయి.
  • సార్కోమా (Sarcoma): ఈ క్యాన్సర్ కనెక్టివ్ లేదా సపోర్టివ్ టిష్యూల్లో (ఎముక, మృదులాస్థి, కొవ్వు, కండరాలు లేదా రక్త నాళాలలో) మొదలవుతుంది.
  • లుకేమియా (Leukaemia): ఇది తెల్ల రక్త కణాలకు వచ్చే క్యాన్సర్. ఇది ఎముక మజ్జ (బోన్ మ్యారో) వంటి రక్త కణాలను తయారు చేసే కణజాలంలో వస్తుంది.
  • లింఫోమా మరియు మైలోమా (Lymphoma and Myeloma): ఈ క్యాన్సర్‌లు రోగనిరోధక వ్యవస్థ కణాల్లోప్రారంభమవుతాయి.
  • మెదడు మరియు వెన్నుపాము క్యాన్సర్‌లు: ఇవి కేంద్ర నాడీ వ్యవస్థ నుంచి వచ్చే క్యాన్సర్‌లు.

క్యాన్సర్ యొక్క దశలు:

Image

చాలా క్యాన్సర్లలో 4 దశలు ఉంటాయి. అయితే శరీరంలో కణితి స్థానం మరియు పరిమాణం బట్టి వివిధ దశలుగా వర్గీకరించవచ్చు.

  • దశ I: క్యాన్సర్ మొదట ప్రారంభమైన కణాలలో మాత్రమే ఉంటుంది. ఈ రకమైన క్యాన్సర్ లను ముందుగానే గుర్తింపచినట్లు అయితే వాటిని నయం చేసుకోవచ్చు.
  • దశ II: క్యాన్సర్ మొదట ప్రారంభమైన అవయవం లోపల ఉంటుంది. అయితే ఇది మొదటి దశ కంటే కొంచెం పెద్దదిగా ఉండవచ్చు మరియు/లేదా పొరుగు శోషరస కణుపులకు వ్యాపించే అవకాశం ఉంటుంది.
  • దశ III: క్యాన్సర్ పెద్దదై శోషరస నోడ్స్ లేదా ఇతర కణజాలాలకు మరియు అవయవాలు లేదా నిర్మాణాలకు దగ్గరగా వ్యాపించి ఉండవచ్చు.
  • దశ IV: ఈ దశలో క్యాన్సర్ శరీరంలోని ఇతర అవయవాలకు మరియు ఇతర ప్రాంతాలకు వ్యాపిస్తుంది. ఈ దశను మెటాస్టాసిస్ లేదా అధునాతన క్యాన్సర్‌గా అని కూడా పిలుస్తారు. మొదట్లో ప్రారంభమైన క్యాన్సరే ముదిరి 4వ రూపంగా మార్పు చెందుతుంది.

క్యాన్సర్ కు చేసే పరీక్షలు:

Image
  • రక్త పరీక్షలు
  • CXR, USG, CT, MRI, PET-CT వంటి ఇమేజింగ్
  • బయాప్సీలు (Biopsies)
  • జన్యు పరీక్షలు వంటి పరీక్షల ద్వారా పలు రకాలైన క్యాన్సర్లను గుర్తిస్తారు.

సాధారణ క్యా న్స ర్ చికిత్స లు:

Image

ఈ మధ్య కాలంలో కాన్సర్ కి లేటెస్ట్ ట్రీట్మెంట్ వచ్చింది . ఇది సక్సెస్ అవ్వడం అనేది క్యాన్సర్ రకాన్ని బట్టి ఉంటుంది. చాలా మంది కాన్సర్ కి సరైన ట్రీట్మెంట్ సక్సెస్ గా చేయగలుగుతున్నారు .కొత్త మందులు, ఇమ్మ్యూనోథెరపీ కాన్సర్ ట్రీట్మెంట్ ని మెరుగుపరిచాయని డాక్టర్స్ చెబుతున్నారు.

  • శస్త్రచికిత్స (Surgery): సాధారణంగా స్థానికరించబడిన క్యాన్సర్ కణితులను శస్త్రచికిత్సతో తొలగించవచ్చు.
  • కీమోథెరపీ (Chemotherapy): కీమోథెరపీ క్యాన్సర్ కణాలను నాశనం చెయ్యడానికి శక్తివంతమైన మందులను ఉపయోగిస్తుంది. ఇది మాత్రల రూపంలో లేదా ఇంట్రావీనస్ ద్వారా ఇవ్వబడుతుంది.
  • రేడియేషన్ థెరపీ (Radiation Therapy): ఈ చికిత్స బాహ్య లేదా అంతర్గత రేడియేషన్ యొక్క అధిక మోతాదులతో క్యాన్సర్ కణాలను చంపుతుంది.
  • హార్మో న్ థెరపీ (Hormone Therapy): క్యాన్సర్ కణాలు శరీరంలో వృది చెందడానికి అవసరమైన హార్మోనులను సీకరించకుండా నిరోధిస్తుంది. రొమ్ము మరియు ప్రోస్టేట్ క్యాన్సర్ల వంటి కొన్ని క్యాన్సర్లో ఈ రకమైన చికిత్స ఉపయోగిస్తారు.
  • ఇమ్మ్యూనోథెరపీ (Immunotherapy): ఇమ్మ్యూనోథెరపీ అనేది ఒక రకమైన క్యాన్సర్ చికిత్స, క్యాన్సర్ కణాలతో పోరాడడంలో రోగనిరోధక వ్యవస్థకు సహాయం చేయడానికి లేదా ఇరర క్యాన్సర్ చికిత్సల యొక్క ప్రతికూల ప్రభావాలను పరిమితం చేయడానికి రోగనిరోధక వ్యవస్థను పెంపొందిస్తుంది. ఈ రకమైన చికిత్సనే బయోలాజికల్ థెరపీ అని కూడా పిలుస్తారు.
  • టార్గెటెడ్ థెరపీ (Targeted Therapy): ఈది ఆరోగ్యకరమైన కణాలను క్యాన్సర్ కణాలుగా మార్చే జన్యు మార్పులు లేదా ఉత్పరివర్తనాలను నిరోధిస్తుంది.
  • ఎముక మజ్జ మార్పిడి (Bone marrow transplant): ఈ రకమైన చికిత్స స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంటేషన్ ట్రాన్స్ ప్లాంటేషన్ అని కూడా పిలుస్తారు. ఈ చికిత్స దెబ్బతిన్న మూలకణాలను ఆరోగ్యమైన వాటితో భర్తీ చేస్తుంది. ఆటోజెనిక్ మార్పిడి అనేది ఆ వ్యక్తి యొక్క ఆరోగ్యమైన మూలకణాల స్వంత సరఫరాను ఉపయోగిస్తుంది.

ఎప్పటికప్పుడు క్యా న్స ర్ పరీక్షలు చేయంచుకుంటూ.. క్యా న్స ర్ కు తొలి దశలోనే చికిత్స తీసుకోవడం ద్వా రా క్యా న్స ర్ మరణాల్లో దాదాపు సగానికి పైగా మరణాల రేట్లను తగ్గించవచ్చు .

Dr. Nivalika Rajamoni
DNB Radiotherapy
Consultant Radiation Oncologist